International Yoga Day: 5 లక్షల మందితో యోగా డే
ABN , Publish Date - May 17 , 2025 | 03:22 AM
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో గొప్పగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ఐదు లక్షల మంది పాల్గొనేలా చారిత్రాత్మకంగా నిర్వహించనున్నారు.
విశాఖ కార్యక్రమానికి మోదీ సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలి. యోగా డే ప్రకటించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జూన్ 21న యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిని చరిత్రలో నిలిపోయేలా చేపట్టాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. యోగా డే నిర్వహణపై సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ ‘యోగా ఫర్ వన్ ఎర్త్... వన్ హెల్త్’. యోగా డే నాడు నిర్వహించే కార్యక్రమం రాష్ట్రంలో యోగ అభ్యాసానికి నాంది పలకాలి. కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగా మంత్’ పాటించాలి. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలి. రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ‘ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. యోగా చేసేందుకు 68 ప్రాంతాలు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో 2,58,948 మంది యోగ సాధనకు అవకాశం కల్పిస్తున్నాం’ అని అధికారులు వివరించారు. సీఎం మాట్లాడుతూ, ‘ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు... బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించండి. ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించండి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News