Share News

PM Modi: యోగాంధ్ర స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jun 23 , 2025 | 06:08 AM

విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

PM Modi: యోగాంధ్ర స్ఫూర్తిదాయకం

  • ఏపీ ప్రజలకు అభినందనలు.. గిన్నిస్‌ రికార్డుపై ‘ఎక్స్‌’లో మోదీ హర్షం

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర స్ఫూర్తిదాయకం అంటూ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. యోగా ఉద్యమాన్ని జీవితంలో భాగంగా మరింత ముందుకు తీసుకెళ్లడంలో స్ఫూర్తిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అభినందనలు తెలిపారు. యోగా మరోసారి ప్రజలను ఏకం చేసిందని పేర్కొన్నారు. యోగాను దేశవ్యాప్తంగా రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని అన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 06:08 AM