-
-
Home » Andhra Pradesh » PM MODI AP VISIT LIVE UPDATES FROM ABN ANDHRA JYOTI VREDDY
-
LIVE UPDATES: ప్రధాని మోదీ ఏపీ పర్యటన లైవ్ అప్డేట్స్
ABN , First Publish Date - Oct 16 , 2025 | 09:58 AM
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్' బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోదీతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఉన్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.
Live News & Update
-
Oct 16, 2025 19:50 IST
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది: Xలో ప్రధాని మోదీ
పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులు: Xలో మోదీ
ఏపీ కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం: మోదీ
శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నా: మోదీ
ఏపీ స్వాభిమాన సంస్కృతి భూమి.. విజ్ఞాన ఆవిష్కరణల కేంద్రం కూడా
స్వచ్ఛశక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు..
భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది: Xలో ప్రధాని మోదీ
-
Oct 16, 2025 16:28 IST
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయి: మోదీ
దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది: ప్రధాని మోదీ
ఏపీ మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాడే దుస్థితి కలిగింది: మోదీ
NDA హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది: మోదీ
నిమ్మలూరు నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు: మోదీ
ఈ ఫ్యాక్టరీ రక్షణరంగంలో కీలక పాత్ర పోషించబోతోంది: మోదీ
కర్నూల్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వం సంకల్పం: మోదీ
-
Oct 16, 2025 16:22 IST
జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాం: ప్రధాని మోదీ
ప్రజలే ప్రాధాన్యంగా మా ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధే మా విధానం: ప్రధాని మోదీ
జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగా జరుపుకున్నారు: ప్రధాని మోదీ
లోకేశ్ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనందాన్నిచ్చింది: మోదీ
-
Oct 16, 2025 16:22 IST
వికసిత్ భారత్ లక్ష్యం సాధనకు.. మల్టీమోడల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అభివృద్ధి: ప్రధాని మోదీ
సబ్బవరం- షీలానగర్ హైవేతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది: ప్రధాని మోదీ
ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో ఉపాధి: మోదీ
భారత్‌ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది: ప్రధాని మోదీ
ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి చాలా ముఖ్యం: మోదీ
రాయలసీమ జిల్లాల్లో ఉపాధి కల్పించేలా పలు ప్రాజెక్ట్‌లు: మోదీ
-
Oct 16, 2025 16:22 IST
వికసిత్ భారత్ లక్ష్యానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకారం అందిస్తోంది: ప్రధాని మోదీ
భారత్, ఏపీ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోంది: మోదీ
గూగుల్ లాంటి కంపెనీ ఏపీలో పెట్టుబడి పెడుతోంది: ప్రధాని మోదీ
అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి పెడుతున్నట్టు గూగుల్ సీఈవో చెప్పారు: ప్రధాని మోదీ
విశాఖలో AI హబ్, డేటా సెంటర్, సబ్ సీ కేటుల్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు
సబ్ సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్ వేగా మారబోతోంది: మోదీ
విశాఖ నుంచే ప్రపంచానికి సేవలు అందబోతున్నాయి: మోదీ
చంద్రబాబు విజన్‌కు మోదీ ప్రత్యేక ప్రశంసలు
-
Oct 16, 2025 16:14 IST
ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది: మోదీ
దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగింది: మోదీ
తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగింది
దేశంలో ఇంధన విప్లవానికి ఏపీ కేరాఫ్‌గా మారింది: మోదీ
ఇళ్లతో పాటు పరిశ్రమలకు తగిన విద్యుత్ అందుతోంది: మోదీ
సహజ వాయువు పైప్‌లైన్‌తో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా
చిత్తూరు LPG బాటిలింగ్ ప్లాంటుకు రోజూ 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యం
-
Oct 16, 2025 16:14 IST
2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది: మోదీ
21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం: మోదీ
ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది
ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి
దేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం: మోదీ
-
Oct 16, 2025 16:06 IST
ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయి: ప్రధాని మోదీ
సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉంది: మోదీ
చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది
కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తున్నాం: మోదీ
16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్‌లా దూసుకుపోతోంది: మోదీ
అభివృద్ధి కోసం ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి: మోదీ
-
Oct 16, 2025 16:06 IST
సోదర, సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగం
అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల ఆశీస్తులు కోరుకుంటున్నా: ప్రధాని మోదీ..
ద్వితీయ జ్యోతిర్లింగమైన మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందా: మోదీ
సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టాను: ప్రధాని మోదీ
విశ్వనాథుడికి సేవ చేసే భాగ్యం కలిగింది: ప్రధాని మోదీ
ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉంది: ప్రధాని మోదీ
-
Oct 16, 2025 15:48 IST
2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: సీఎం చంద్రబాబు
మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం: చంద్రబాబు
ఆపరేషన్ సిందూర్.. మన సైనిక బలం నిరూపించింది: చంద్రబాబు
మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి మోదీ: చంద్రబాబు
-
Oct 16, 2025 15:45 IST
దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన ఘనత మోదీది: లోకేశ్
మోదీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగింది: నారా లోకేశ్
ట్రాంప్ టారిఫ్స్‌తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదు
ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: మంత్రి నారా లోకేశ్
జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్: నారా లోకేశ్
పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగ: నారా లోకేశ్
దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన ఘనత మోదీదే: లోకేశ్
-
Oct 16, 2025 15:28 IST
ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ: పవన్ కల్యాణ్
మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు: పవన్ కల్యాణ్
దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారు: పవన్ కల్యాణ్
కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి: పవన్
ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని మనం నిలబడాలి: పవన్
-
Oct 16, 2025 15:28 IST
భారత్‌ను తిరుగులేని శక్తిగా మోదీ మారుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల: మంత్రి లోకేశ్
కర్నూలు ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు: నారా లోకేశ్
మన నమో అంటే విక్టరీ.. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే: నారా లోకేశ్
గుజరాత్ సీఎంగా.. దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేస్తుకున్నారు: నారా లోకేశ్
-
Oct 16, 2025 15:03 IST
రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు
రూ.2,279 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన మోదీ
-
Oct 16, 2025 15:03 IST
నన్నూరులో 'సూపర్ GST-సూపర్ సేవింగ్' బహిరంగసభ
పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరించిన సీఎం చంద్రబాబు
మోదీని శాలువతో సత్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ప్రధానికి ఆంజనేయస్వామి జ్ఞాపిక అందజేసిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
-
Oct 16, 2025 15:03 IST
ప్రధాని మోదీ రోడ్ షో
నన్నూరులో సభా వేదిక వరకు ప్రధాని మోదీ రోడ్ షో
ప్రధాని మోదీ వెంట చంద్రబాబు, పవన్
ప్రధాని మోదీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
-
Oct 16, 2025 15:01 IST
కాసేపట్లో కర్నూలుకు ప్రధాని మోదీ
రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
నన్నూరు దగ్గర 'సూపర్ GST-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగసభ
హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్
-
Oct 16, 2025 13:49 IST
కాసేపట్లో కర్నూలుకు ప్రధాని మోదీ
రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
నన్నూరు దగ్గర 'సూపర్ GST-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగసభ
-
Oct 16, 2025 13:48 IST
articleText
-
Oct 16, 2025 13:43 IST
ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు నివాళులర్పించిన మోదీ
-
Oct 16, 2025 13:35 IST
articleText
-
Oct 16, 2025 13:17 IST
ప్రధాని మోదీ కోసం శివుని వేషంలో వచ్చిన అభిమాని
-
Oct 16, 2025 13:05 IST
శ్రీశైలంలో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ప్రధాని
శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
కర్నూలుకు బయల్దేరిన ప్రధాని, చంద్రబాబు, పవన్
-
Oct 16, 2025 12:27 IST
శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోదీ
శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్న ప్రధాని
-
Oct 16, 2025 12:25 IST
శ్రీశైలంలో మోదీ ప్రత్యేక పూజలు (విజువల్స్)
-
Oct 16, 2025 12:15 IST
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ధ్యానం చేయనున్న పీఎం మోదీ
-
Oct 16, 2025 11:56 IST
శ్రీశైలం ఆలయంలో ప్రధాని మోదీ
భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న మోదీ
శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రధాని
మల్లికార్జున స్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం
భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రధాని
పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్న ప్రధాని
శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్న ప్రధాని
-
Oct 16, 2025 11:45 IST
నంద్యాల : శ్రీశైలం భ్రమరాంబ అతిధి గృహనికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ
మరికొద్ది సేపట్లో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్న శివసేవకులు,కూటమి కార్యకర్తలు
-
Oct 16, 2025 11:30 IST
శ్రీశైలంలోని భ్రమరాంబ అతిధి గృహానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సుండిపెంట నుంచి హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకున్న మోదీ..
పీఎం మోదీ తో పాటు ప్రత్యేక కాన్వాయ్ లోనే వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..
11.45 గంటలకు మల్లన్న ఆలయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ..
మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోదీ..
అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రానికి వెళ్లనున్న మోదీ..
-
Oct 16, 2025 11:24 IST
శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో ప్రధాని మోదీ
-
Oct 16, 2025 11:11 IST
ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ.. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి లోకేష్ ట్వీట్
-
Oct 16, 2025 11:10 IST
బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్న మంత్రి లోకేష్
లోకేష్ తో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రధాని మోదీ రాకముందే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్న లోకేష్
-
Oct 16, 2025 11:07 IST
ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం బయలుదేరిన మోదీ
భ్రమరాంబ అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్న మోదీ
అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సేవలో పాల్గొననున్న మోదీ
-
Oct 16, 2025 11:05 IST
శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోదీ
మోదీ వెంట సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్ర ,మంత్రులు
-
Oct 16, 2025 11:04 IST
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ట్వీట్
-
Oct 16, 2025 11:02 IST
నంద్యాల: సుండిపెంటకు చేరుకున్న ప్రధాని మోదీ
శ్రీశైలం సమీపంలోని సుండిపెంట హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్
హెలిప్యాడ్ వద్ద ప్రాదాని మోదీకి ఘన స్వాగతం పలికిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , బీసి జనార్థన్ రెడ్డి ఎంపి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పి సునీల్ సెరాన్
సున్నిపెంట హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గంలో మొదటిసారిగా శ్రీశైలం వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-
Oct 16, 2025 10:58 IST
బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
సభ స్థలానికి భారీగా చేరుకుంటున్న ప్రజలు
దాదాపు మూడు లక్షల మంది సభలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు
ఇందుకు సంబంధించిన భారీ బందోబస్తీని పోలీసులు ఏర్పాటు చేశారు
-
Oct 16, 2025 10:51 IST
రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని
కర్నూలులో రూ.2,086 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు
ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
రూ.677 కోట్లతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులు
రూ.964 కోట్లతో సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు ప్రారంభోత్సవం
రూ.1,142 కోట్లతో చేపట్టిన సిక్స్ లేన్ రోడ్డు ప్రాజెక్టులు
కృష్ణా జిల్లా నిమ్మకూరులో రూ.362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్
కర్నూలు నుంచి జాతీయ గ్రిడ్‌కు పునరుత్పాదక విద్యుత్ సరఫరా, అనుసంధానం
కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్
పెందుర్తి-సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి
-
Oct 16, 2025 10:36 IST
ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతున్న ఫొటోలు



-
Oct 16, 2025 10:32 IST
ప్రధాని మోదీ పర్యటన లైవ్ కవరేజ్
-
Oct 16, 2025 10:29 IST
హెలికాప్టర్‌లో శ్రీశైలం బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
-
Oct 16, 2025 10:06 IST
నన్నూరు దగ్గర 'సూపర్ GST-సూపర్ సేవింగ్' పేరుతో బహిరంగసభలో పాల్గొననున్న మోదీ
ఈ బహిరంగసభకు హాజరుకానున్న ప్రధాని మోదీ
పాల్గొననున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్, లోకేష్
రూ.13,430 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
సా.4:45కు ఢిల్లీ బయల్దేరనున్న ప్రధాని మోదీ
-
Oct 16, 2025 10:04 IST
హెలికాఫ్టర్ లో శ్రీశైలానికి ప్రధాని మోదీ
భ్రమరాంబామల్లికార్జున స్వామికి మోదీ ప్రత్యేక పూజలు
తరువాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్న మోదీ
మధ్యాహ్నం కర్నూల్ లో GST 2.0పై సభలో ప్రసంగించనున్న మోదీ
-
Oct 16, 2025 10:01 IST
ఏపీలో పర్యటనలో ప్రధాని మోదీ అభివృద్ధి పనులు
ఓర్వకల్లులో రూ.2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన
కడప జిల్లా కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం
రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్
రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి
చిత్తూరు జిల్లాలో రూ.200 కోట్లతో ఇండేన్ గ్యాస్ ప్లాంట్
పీలేరు-కల్లూరు సెక్షన్‌లో భాకరాపేట వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం
కడప-నెల్లూరు సరిహద్దు నుంచి సీఎస్‌పురం వరకు హైవే నిర్మాణం
గుడివాడలో రూ.98 కోట్లతో నిర్మించిన ఫోర్ లేన్ బ్రిడ్జి ప్రారంభం
కమలాపురం దగ్గర పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెన
రూ.546 కోట్లతో నిర్మించిన కొత్తవలస-కోరాపూట్ రైల్వే డబ్లింగ్ పనులు జాతికి అంకితం
రూ.1,730 కోట్లతో నిర్మించిన శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ జాతికి అంకితం
కర్నూలులో రూ.2,886 కోట్లతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్
రూ.362 కోట్లతో నిమ్మకూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ కేంద్రం ప్రారంభం
-
Oct 16, 2025 09:59 IST
కర్నూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
మోదికి ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ =
-
Oct 16, 2025 09:58 IST
కాసేపట్లో కర్నూలుకు ప్రధాని మోదీ
స్వాగతం పలకనున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్, లోకేష్