-
-
Home » Andhra Pradesh » PM Modi and CM Chandrababu Naidu Inaugurate Amaravati Capital City Live Updates in Telugu Siva
-
Amaravati inauguration live: చంద్రబాబును చూసి నేర్చుకొన్నా..: ప్రధాని మోదీ
ABN , First Publish Date - May 02 , 2025 | 03:12 PM
Amaravati Inauguration Live Updates in Telugu: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలు మూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
Live News & Update
-
2025-05-02T17:50:30+05:30
విశాఖలో జూన్ 21న యోగా డేలో పాల్గొంటా: ప్రధాని మోదీ
యోగా డే రోజు ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయాలి.
మూడేళ్లలో రాజధాని నిర్మాణం తర్వాత.. ఏపీ జీడీపీలో అమరావతి కీలకంగా మారుతుంది.
-
2025-05-02T17:48:34+05:30
ముగిసిన ప్రధాని ప్రసంగం..
సభా ప్రాంగణం నుంచి హేలీ పాడ్‌కు బయలుదేరిన ప్రధానమంత్రి మోదీ
-
2025-05-02T17:41:14+05:30
దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త వ్యవస్థకు శంకుస్థాపన చేశాం: మోదీ
అమృత్ భారత్ కింద చాలా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాం.
భారత్ శక్తి ఆయుధాలతోనే కాదు.. ఐక్యతలోనూ ఉంటుంది.
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ భావన మరింత బలోపేతం చేస్తాం.
-
2025-05-02T17:37:57+05:30
దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రారంభించాం: మోదీ
ప్రతి ఎకరానికి నీరు అందించాలన్నదే మా లక్ష్యం.
పోలవరం పనుల వేగం మరింత పుంజుకుంది.
పోలవరం త్వరగా పూర్తయ్యేందుకు సహకరిస్తాం.
-
2025-05-02T17:35:48+05:30
రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం: మోదీ
రైతులకు సరికొత్త, ఆధునిక విత్తనాలు అందిస్తున్నాం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద.. ఏపీలో లక్షలాదిమంది రైతులకు రూ.17,500 కోట్లు జమ చేశాం.
-
2025-05-02T17:35:06+05:30
వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారు: మోదీ
నేను, చంద్రబాబు, పవన్ కలిసి వికసిత్ ఆంధ్ర కోసం కృషి చేస్తాం
-
2025-05-02T17:34:15+05:30
ఏపీకి రైల్వే నిధులు భారీగా పెంచాం: ప్రధాని మోదీ
2009-14 వరకు ఉమ్మడి ఏపీకి రూ. 900 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉండేది.
ఇప్పుడు ఒక్క ఏపీ రైల్వే బడ్జెట్ రూ. 9వేల కోట్లపైనే ఉంది.
రైల్వే బడ్జెట్ పెరగడం వల్ల వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తయ్యింది.
హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది.
రేణిగుంట-నాయుడిపేట హైవే వల్ల తిరుపతికి వేగంగా చేరుకోవచ్చు.
పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఏపీలో వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి.
అమృత్ భారత్ రైలు కూడా ఏపీ నుంచే వెళ్తుంది.
ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాం.
-
2025-05-02T17:22:02+05:30
చంద్రబాబును చూసి నేర్చుకొన్నా..: ప్రధాని మోదీ
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం.
రికార్డు స్పీడ్‌లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుంది.
ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుంది.
చంద్రబాబు.. నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను.
-
2025-05-02T17:12:32+05:30
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి..: ప్రధాని మోదీ
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోంది.
చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్.
దుర్గాభవానీ కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.
బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇది.
ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నాను.
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి.
ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉంది.
ఇవి శంకుస్థాపనలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం.
-
2025-05-02T17:11:32+05:30
articleText
-
2025-05-02T16:59:29+05:30
తిరుపతిని స్పిరిట్యువల్ హబ్‌గా తయారుచేస్తాం: చంద్రబాబు
కడప స్టీల్‌ప్లాంట్ వస్తోంది.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి సాధ్యం.
విశాఖలో జూన్ 21న యోగా డేకు మోదీని ఆహ్వానించాం.
మూడేళ్ల తర్వాత రాజధాని ప్రారంభానికి మరోసారి మోదీ రావాలి.
-
2025-05-02T16:58:42+05:30
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తాం: చంద్రబాబు
IRR, ORRతో రాజధాని అభివృద్ధి చేస్తాం.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులతో ప్రపంచంలోని అన్ని నగరాలకు అనుసంధానం.
అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం.
బిట్స్ పిలానీ, రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్స్ వస్తున్నాయి.
అమరావతిని AI హబ్‌గా మారుస్తాం.
కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి.
నదుల అనుసంధానం పూర్తిచేస్తాం.
వచ్చే ఏడాదికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తాం.
-
2025-05-02T16:57:56+05:30
అమరావతి రైతులు లాఠీదెబ్బలు తిన్నారు.. జైలుకు వెళ్లారు: చంద్రబాబు
అమరావతి ఉద్యమకారులందరికీ నా సెల్యూట్.
2024 ఎన్నికల్లో ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది.
అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించాం.
5 కోట్లమంది ప్రజలు నా రాజధాని అన్ని గర్వంగా చెప్పుకునేలా చేస్తాం.
వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తి చేస్తాం.
-
2025-05-02T16:57:03+05:30
ప్రధాని మోదీ ఒక మోడల్: చంద్రబాబు
సంక్షేమం, అభివృద్ధి, స్వయం ఉపాధితో భారత్ వికాసం.
ప్రధాని మోదీకి వ్యక్తిగతం కన్నా దేశమే ముఖ్యం.
కులగణన దేశంలో బిగ్ గేమ్‌ఛేంజర్ కాబోతోంది.
మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప దేశంగా అవతరించబోతోంది.
వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి అగమ్యగోచరం.
వెంటిలేటర్‌పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు.. కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి ఊపిరిపోసింది.
గత ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారు.
-
2025-05-02T16:40:46+05:30
ప్రధాని మోదీ ఒక మోడల్: చంద్రబాబు
సంక్షేమం, అభివృద్ధి, స్వయం ఉపాధితో భారత్ వికాసం.
ప్రధాని మోదీకి వ్యక్తిగతం కన్నా దేశమే ముఖ్యం.
కులగణన దేశంలో బిగ్ గేమ్‌ఛేంజర్ కాబోతోంది.
మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప దేశంగా అవతరించబోతోంది.
-
2025-05-02T16:36:26+05:30
ఏపీ చరిత్రలో ఇవాళ లిఖించదగ్గ రోజు: చంద్రబాబు
ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు అండగా ఉంటాం.
దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారు.
సరైన సమయంలో సరైన నేత భారత్‌కు ప్రధానిగా ఉన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని కలిశాను.
ఎప్పుడూ ఆహ్లాదంగా కనిపించే మోదీ.. చాలా గంభీరంగా కనిపించారు.
అమాయక పర్యాటకుల్ని ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు.
దేశం మొత్తం మోదీ వెనుక ఉంది.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
మోదీ ప్రధాని అయ్యాక ఐదో ఆర్థిక వ్యవస్థంగా అవతరించాం.
-
2025-05-02T16:26:35+05:30
అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివి: పవన్ కల్యాణ్
గత ఐదేళ్లు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
అమరావతి రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు.
అమరావతి రైతులు మరిచిపోలేని పోరాటం చేశారు.
అమరావతే రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చాం.
ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోదీతో.. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం.
గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసింది.
ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు.
అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివి.
ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకం.
అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది.
రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది.
అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది.
రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి ఒక భవిష్యత్ ఇచ్చారు.
రాళ్లు, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు.
సైబరాబాద్‌ను చంద్రబాబు ఎలా సృష్టించారో.. అమరావతిని కూడా అలాగే అభివృద్ధి చేస్తారు.
దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారు.
ఏపీపై మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనం.
-
2025-05-02T16:17:08+05:30
ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు: పవన్
అమరావతి రైతులు గత ఐదేళ్లుగా పోరాడారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మేము మాటిచ్చాం.
అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు.
గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంత రైతులు నలిగిపోయారు.
రాజధాని రైతుల పోరాటం మరువలేనిది.
అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు.
గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసింది.
అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.
-
2025-05-02T16:10:08+05:30
అమరావతి నమో నమః.. మంత్రి నారా లోకేష్.
గతంలో వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు.
వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు.
జై అమరావతి అన్నందుకు గతంలో తిరగలేని పరిస్థితి.
మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరు.
ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు.
-
2025-05-02T16:08:37+05:30
ప్రధాని మోదీ ఒక మిస్సైల్: మంత్రి లోకేష్
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు: మంత్రి లోకేష్
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంది.
పాకిస్థాన్‌కు సమాధానం చెప్పగలిగే మిస్సైల్ ప్రధాని మోదీ
ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా ఏం చేయలేవు.
మోదీ కొట్టే దెబ్బకు పాకిస్థాన్ తోకముడవటం ఖాయం.
-
2025-05-02T16:08:36+05:30
అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.
సభా వేదిక పైనుంచే మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.
అమరావతిలో రూ.49,040 కోట్ల పనులకు మోదీ శ్రీకారం.
రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన.
రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.
-
2025-05-02T15:47:09+05:30
సభా వేదిక పైకి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేరుకున్నారు.
-
2025-05-02T15:43:29+05:30
భారీగా తరలి వస్తున్న ప్రజలు..
అమరావతి: అమరావతి పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.
వాహనాలతో నిండిపోయిన పార్కింగ్ కేటాయించిన ప్రదేశాలు.
దూర ప్రాంతం నుంచి వచ్చే బస్సులను విజయవాడ అవుట్ కట్స్‌లో నిలిపివేస్తున్న పోలీసులు.
పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పెట్టే చోటు లేకపోవడంతో విజయవాడ నగరం విలుపలే వాహనాల్ని నిలిపివేత.
-
2025-05-02T15:38:03+05:30
ఆంధ్రుల కలల రాజధాని తిరిగి సాకారం అవుతున్న రోజు
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని తిరిగి సాకారం అవుతున్న రోజు ఇది: మంత్రి అనగాని సత్యప్రసాద్
ఒక సైకో పాలనలో ఐదేళ్లపాటు హహాకారాలు చేసిన అమరావతి నేడు తిరిగి పునరజీవం పొందుతోంది.
ప్రజా రాజధాని అమరావతి తిరిగి నిలబడుతుంది.
కుట్రలను, విష ప్రచారాలను తిప్పి కొట్టి విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో అమరావతి ఇక అజరామంగా వెలగనుంది.
-
2025-05-02T15:30:39+05:30
వెలగపూడిలో మోదీకి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం
-
2025-05-02T15:24:05+05:30
మ.3:30కు సభాస్థలికి చేరుకోనున్న ప్రధాని మోదీ..
గంటా 15 నిమిషాల పాటు సభలో పాల్గొననున్న ప్రధాని.
అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.
రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు.
సా.4:55కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనం.
-
2025-05-02T15:15:44+05:30
ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
IBM, TCS, L&Tలతో దేశంలోనే తొలి టెక్‌పార్క్‌కు MoU.
2026 జనవరి 1న తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్ ప్రారంభం.
క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి.. IBM, TCS, L&Tలతో ఒప్పందాలపై సంతకాలు.
క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణలతో పాటు.. ఏపీని ప్రపంచ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యం.
-
2025-05-02T15:12:58+05:30
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
స్వాగతం పలికిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వెలగపూడికి ప్రధాని మోదీ
హెలిప్యాడ్ దగ్గర మోదీకి స్వాగతం పలకనున్న చంద్రబాబు, పవన్
కాసేపట్లో అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన
సభా వేదిక పైనుంచే మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని మోదీ
రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు