Share News

Pemmasani Chandrashekar: ప్రపంచ మహాసభలకు తెలుగు ప్రజలు తరలిరావాలి

ABN , Publish Date - May 04 , 2025 | 04:34 AM

2026 జనవరిలో గుంటూరులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని పిలుపు

Pemmasani Chandrashekar: ప్రపంచ మహాసభలకు తెలుగు ప్రజలు తరలిరావాలి

  • 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రిక ఆవిష్కరణలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు(తూర్పు), మే 3(ఆంధ్రజ్యోతి): మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహా సభల ప్రచార పత్రికను ఆయన గుంటూరు, భారతీయ విద్యా భవన్‌లో శనివారం ఆవిష్కరించి ప్రసంగించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మేవ జయతే నినాదంతో నిర్వహిస్తున్న తెలుగు పండుగను ప్రతిష్ఠాత్మకంగా గుంటూరులో జరపడం అందరికీ గర్వకారణమన్నారు. తాను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వారి హృదయాల్లో స్ధానం పొందేందుకు తెలుగు భాష చక్కటి మాధ్యమంగా పనిచేసిందని తెలిపారు. తెలుగు మహా సభలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించాలని నిర్వాహకుల విజ్ఞప్తికి పెమ్మసాని సానుకూలంగా స్పందించారు.


గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ తెలుగు మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. మహాసభల లోగోలను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారని, ప్రచార పత్రికలను పెమ్మసాని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆదివారం నుంచి పలు జిల్లాలో వాహనాల ద్వారా తెలుగు మహాసభల విశిష్టత తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తామన్నారు.


ఇవి కూడా చదవండి

Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2025 | 04:34 AM