Share News

AP Deputy CM : క్షీరదాలను సంరక్షించుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:08 AM

క్షీరదాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

AP Deputy CM : క్షీరదాలను సంరక్షించుకోవాలి

  • పాంగోలిన్‌ల మనుగడను కాపాడాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అరుదైన, అసాధారణమైన క్షీరదాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. అందులో భాగంగా పురుగుల నియంత్రణకు ఉపయోగపడే ’పాంగోలిన్‌’ల మనుగడ కూడా ముఖ్యమని అన్నారు. శుక్రవారం ప్రపంచ పాంగోలిన్‌ దినోత్సవాల్లో భాగంగా మంగళగిరిలోని అరణ్య భవన్‌లో అటవీశాఖ, తూర్పు కనుమల వన్యప్రాణుల సొసైటీ సహకారంతో పాంగోలిన్‌ల సంరక్షణ ప్రాజెక్ట్‌ నివేదికను పీసీసీఎ్‌ఫ(వైల్డ్‌లైఫ్‌) ఏకే నాయక్‌, అదనపు పీసీసీఎఫ్‌ శాంతిప్రియా పాండే, ఐఎఫ్ఎస్‌ అధికారి రాహుల్‌పాండే కలిసి విడుదల చేశారు. ఇండియన్‌ పాంగోలిన్‌పై పోస్టర్‌ను ఆవిష్కరించి, అటవీ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ సందేశాన్ని అధికారులు వివరించారు.

Updated Date - Feb 15 , 2025 | 05:09 AM