Share News

Employment guarantee scheme: ఉపాధి నిధులు విడుదల చేయండి

ABN , Publish Date - May 17 , 2025 | 04:08 AM

ఉపాధి హామీ పథక బిల్లులను వెంటనే చెల్లించాలన్న పంచాయతీరాజ్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదలవుతాయని, సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలని కోరారు.

Employment guarantee scheme: ఉపాధి నిధులు విడుదల చేయండి

సర్పంచ్‌ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉపాధి నిధులు గ్రామ సర్పంచ్‌ల ఖాతాల్లో జమచేసి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని పంచాయతీరాజ్‌ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఆ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ను శుక్రవారం కలిశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జీలు ఆయా ఖాతాల్లోకి జమ చేసేలా రిజిస్ట్రేషన్‌ విభాగానికి సిఫార్సు చేయాలని కోరారు. శశిభూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘15వ ఆర్థిక సంఘం నిధులు 15 రోజుల్లో విడుదలవుతాయి. త్వరలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు కూడా కొంతమేరకు విడుదల అవుతాయి’ అని తెలిపారు. సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకూ గౌరవ వేతనం పెంచాలని సర్పంచ్‌ల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:08 AM