Share News

Palla Srinivasa Rao Warns Jagan: భాష మార్చుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:34 AM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జగన్‌పై తీవ్రంగా స్పందిస్తూ, ఆయన భాష మార్చుకోకపోతే వైసీపీని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు

Palla Srinivasa Rao Warns Jagan: భాష మార్చుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం

గాజువాక (విశాఖపట్నం), ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన భాషను మార్చుకోకపోతే వైసీపీని రాజకీయ సమాధి చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖలో బుధవారం నిర్వహించిన కేడర్‌ విత్‌ లీడర్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీసులపై జగన్‌ వాడిన భాష అభ్యంతరకరమన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 03:34 AM