Share News

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి వంట పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:42 AM

జైల్లో వంట చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ..

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి వంట పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా

  • మూడోసారి పైలా దిలీప్‌ బెయిల్‌ పిటిషన్‌

విజయవాడ, జూలై 16(ఆంధ్రజ్యోతి): జైల్లో వంట చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. మద్యం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పైలా దిలీప్‌ ఏసీబీ కోర్టులో బుధవారం మూడోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తనకు కొద్దినెలల క్రితమే వివాహమైనందున బెయిల్‌ ఇవ్వాలని కోరాడు. బ్యారక్‌ను మార్చాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీఏ బాలాజీ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బాలాజీ కుమార్‌ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తనను ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌లోకి మార్చాలని, తన బ్యారక్‌లో విద్యుద్దీపాలు వెలగడం లేదని పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ జైలు అధికారులు కోర్టులు వివరాలు అందజేశారు. దీంతో ఆయన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Updated Date - Jul 17 , 2025 | 03:42 AM