AP Judiciary: లోక్ అదాలత్‌లకు విశేష స్పందన
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:19 AM
ఒక్కరోజే 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు..

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 49,056 కేసుల పరిష్కారం
అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. ఒక్కరోజే 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడు జస్టిస్ ఎన్.రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ ఆర్.రఘునందనరావు మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాలో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఇరువర్గాల ఆమోదంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. మరోవైపు హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ, జస్టిస్ వై.లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న 125 కేసులు పరిష్కరించి, రూ.2 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్‌ల విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతజ్ఙతలు తెలిపారు.