Share News

YCP: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న మరో వైసీపీ నేత

ABN , Publish Date - Jan 24 , 2025 | 10:09 PM

YCP : వైసీపీలో అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మరో నేత సైతం విజయసాయిరెడ్డి బాటలోనే పయనిస్తున్నారు. ఆయన ఎవరో కాదు..

YCP: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న మరో వైసీపీ నేత
YCP

అమరావతి, జనవరి 24: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు మరో వైసీపీ నేత బాంబు పేల్చారు. ఇప్పటికే వైసీపీలో అత్యంత సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక విజయసాయిరెడ్డి బాటలోనే మరో వైసీపీ నేత పయనిస్తున్నారని తెలుస్తోంది. ఆయన సైతం రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. ఆయనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఆయన సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించనున్నారట.

ALLA-Ayodya-ramireddy.jpg

ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని.. స్వదేశానికి రాగానే ఆయన కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అధికారానికి దూరమై ఏడాది కూడా కాలేదు.. వైసీపీ నుంచి ఆ పార్టీ అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్‌రావులు తమ తమ రాజ్యసభ సభ్యత్వాలతోపాటు ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అనంతరం వారు టీడీపీలో చేరారు.


ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఆ పార్టీని వీడి.. జనసేనలో చేరారు. ఇక వైసీపీ నుంచి మరింత మంది రాజీనామాలు చేయనున్నట్లు ఓ ప్రచారం అయితే సాగుతోంది. అదీకాక వైసీపీ స్థాపన నాటి నుంచి ఉన్న విజయసాయిరెడ్డి ఇంత ఆకస్మాత్తుగా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతోన్నాయి.

Also Read: విజయసాయిరెడ్డి రాజీనామా.. వైసీపీలో అశాంతి


ఇక ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలుపొంది ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడే ఈయన. ఈయన సైతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతోన్నారు. తన రాజ్యసభ సభ్యత్వంతోపాటు.. పార్టీకి సైతం ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేస్తారనే తెలుస్తోంది.

Also Read: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్


పార్టీలో వరుస రాజీనామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఆందోళన చెందుతోన్నట్లు సమాచారం. పార్టీ నుంచి ఎన్నికల ముందు కొంత మంది వెళ్లితే.. ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు.. ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది కాకుండా.. మరి కొందరు ఇలా రాజీనామాలు చేసి వెళ్లితే.. నెక్ట్స్ ఏమిటనే ఆలోచనలో ఆ పార్టీలోని పలువురు కీలక నేతలను సైతం ఆలోచనలో పడిసినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

మరిన్ని తెలుగు వార్తలు కోసం..

Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..

Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 10:18 PM