కుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:01 AM
రాష్ట్రంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం అధికారులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు మంత్రి నారాయణ బృందం
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం అధికారులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారాయణ బృందం సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకుంది. మంత్రితో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వెళ్లారు. ఈ బృందం అక్కడి కుంభమేళా అథారిటీ ఆఫీసును సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల గురించి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా మంత్రి, అధికారులు పరిశీలించారు.