Share News

Nuzvid : ఒక్కొక్కటిగా పరిష్కారం...

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:59 AM

ఒక్కొక్కటిగా పరిష్కారం.. నూజివీడు మున్సిపల్‌ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’’ సదస్సులో లేవనెత్తిన ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. సమస్యలు

Nuzvid : ఒక్కొక్కటిగా పరిష్కారం...

‘ఆంధ్రజ్యోతి’ సదస్సులో లేవనెత్తిన సమస్యలపై చర్యలు

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): నూజివీడు మున్సిపల్‌ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన ‘‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’’ సదస్సులో లేవనెత్తిన ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సోమవారం నూజివీడు ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రెయిన్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. మురుగు కాలువల్లో ఎవరైనా వ్యర్థాలు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. కుక్కలు, కోతుల దాడుల వల్ల ప్రజలు గాయాల పాలవుతున్న విషయాన్ని స్థానికులు ప్రస్తావించిన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. కుక్కల సంతతి నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ నిర్వహించేందుకు వాటిని పట్టి తరలించారు.



మరిన్ని...

Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 05:59 AM