Cine Vajrotsavam : సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:59 AM
సింగపూర్‌లోని ఆర్యసమాజ్ ఆడిటోరియంలో ఆదివారం సింగపూర్ జై ఎన్టీఆర్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ....
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌లోని ఆర్యసమాజ్ ఆడిటోరియంలో ఆదివారం సింగపూర్ జై ఎన్టీఆర్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యుడు భగీరథ సంపాదకత్వంలో ప్రచురించిన ‘తారకనామం’ పుస్తకం, ఎన్టీఆర్‌పై టీడీ జనార్దన్ రూపొందించిన ‘తెలుగువారి గుండెబలం’ పాటను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ మహోన్నతమైన ఎన్టీఆర్‌కు కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నారు. మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డును ప్రకటిస్తే తెలుగు వారికి సంతోషం కలుగుతుందన్నారు. జనార్దన్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ను ధ్రువతారగా అభివర్ణించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల