Balakrishna-NSE: బాలకృష్ణ మరో రికార్డు.. ఎన్ఎస్‌ఈ బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:00 PM
ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ని సందర్శించిన ప్రముఖ నటుడు బాలకృష్ణ ఈ సందర్భంగా అక్కడి బెల్‌ను మోగించారు. బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా రికార్డు సృష్టించారు. ఎన్ఎస్‌ఈ అధికారుల ఆహ్వానం మేరకు బాలకృష్ణ.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బృందంతో కలిసి స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించారు (NSE Bell). బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు .
ఎన్‌ఎస్‌ఈలో ప్రత్యేక కార్యక్రమాలు, వేడుకల సందర్భంగా అతిథులు ఈ గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్‌ఎస్‌ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెల్ మోగించారు. ఐపీఓ ద్వారా తొలిసారి స్టాక్ మార్కెట్‌లో కాలుపెట్టే కంపెనీలు కూడా బెల్ మోగించి నిధుల సమీకరణ ప్రారంభించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. గతంలో నటుడు అజయ్ దేవ్‌గణ్ కూడా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్ఎస్‌ఈ గంట మోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆధార్‌ను అంగీకరించాల్సిందే.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
For More AP News And Telugu News