Nimmala Ramanaidu: బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ
ABN , Publish Date - May 01 , 2025 | 03:57 AM
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి, బుడమేరు ఆధునికీకరణ పనులను త్వరగా చేపట్టాలని స్పష్టం చేశారు
అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. కాలువ ఎనికేపాడు నుంచి కొల్లేరు మీదున్న ఉప్పుటేరు గుండా సముద్రంలోకి కలిసేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించాలన్నారు. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహానికి తగ్గట్టుగా పనులు సత్వరమే చేపట్టాలని స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో బుడమేరు, పోలవరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష జరిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.