Nidigunta Aruna: పోలీసు కస్టడీకి కిలేడీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:55 AM
అనేక అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కి‘లేడీ’ నిడిగుంట అరుణను గురువారం పోలీసులో ..
కోవూరు స్టేషన్‌లో తొలిరోజు విచారణ
నేడు, రేపూ ప్రశ్నించనున్న పోలీసులు
కోవూరు/ఒంగోలు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అనేక అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కి‘లేడీ’ నిడిగుంట అరుణను గురువారం పోలీసులో కస్టడీకి తీసుకుని విచారించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిఽధిలోని పడుగుపాడులోని ఓ అపార్టుమెంట్‌లో ఫ్లాటును ఆక్రమించిన కేసులో ఈ నెల 19న ఆమె అరెస్టయి రిమాండ్‌పై ఒంగోలు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను కస్టడీలో విచారించేందుకు కోవూరు పోలీసులు అభ్యర్థించడంతో కోర్టు మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. అరుణను గురువారం ఒంగోలు జైలు నుంచి కోవూరు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎస్‌ఐ రంగనాఽథ్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సమాచారం తీసుకున్న అనంతరం ఆమెను నెల్లూరులోని జిల్లా జైలుకు తరలించారు. శుక్ర, శనివారాల్లోనూ పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. పలు నేరాలతో సంబంధమున్న అరుణ విచారణలో ఏం చెబుతుందోనని ఇటు పోలీసులు, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..