Minister TG Bharat : ఆహార శుద్ధి పరిశ్రమలకు వన్-స్టాప్ హెల్ప్‌లైన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:17 AM
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న లక్ష్యంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్...

ప్రారంభించిన మంత్రి టీజీ భరత్
అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న లక్ష్యంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 04045901100 నంబరుతో వన్-స్టాప్ హెల్ప్‌లైన్ సెంటరును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేవారు.. ప్రాజెక్ట్ రిపో ర్టు సమర్పించడం మొదలు ప్రభుత్వ అనుమతులు పొందే వరకు వివిధ దశల్లో అవసరమైన సాయమందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద జిల్లా రిసోర్స్ పర్సన్‌లను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో అనుసంధానం చేసి బ్యాంకు రుణాలు పొందడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుందన్నారు.