Share News

Nellore Court: నెయ్యి కల్తీ కేసులో ఏ12 బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:52 AM

తిరుమల నెయ్యి కల్తీ కేసులో ఏ12 నిందితుడు హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ వచ్చే వారం 12 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేయనుంది

Nellore Court: నెయ్యి కల్తీ కేసులో ఏ12 బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

  • వచ్చేవారం 12 మంది నిందితులపై చార్జిషీటు?

తిరుపతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఏ12 నిందితుడు హరిమోహన్‌ రాణా బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బోలేబాబా డెయిరీలో జీఎంగా ఉన్న హరిమోహన్‌ రాణాను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న హ రిమోహన్‌ రాణా బెయిల్‌ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ఈనెల 24న విచారణ జరిగింది. నిందితుడి తర ఫున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపించగా బెయిల్‌ ఇవ్వవద్దంటూ సిట్‌ తరఫున ఏపీపీ జయశేఖర్‌ వాదించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, సిట్‌ అధికారులు ఈ కేసులో ఇద్దరు టీటీడీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్న ఆ ఇద్దరిని సిట్‌ ప్రశ్నిస్తోంది. వారిద్దరినీ ఈ కేసులో ఏ9, ఏ10గా చేర్చుతున్నట్టు తెలిసింది. వచ్చేవారం 12 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి

AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్‌’పై కీలక ఒప్పందం

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:52 AM