Share News

ఏపీతో కలసి పనిచేసేందుకు సిద్ధం: ఎన్‌ఐఎస్‌జీ

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:56 AM

ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయడానికి ఎంతో ఆసక్తితో ఉన్నామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ (ఎన్‌ఐఎ్‌సజీ) స్పష్టం చేసింది.

ఏపీతో కలసి పనిచేసేందుకు సిద్ధం: ఎన్‌ఐఎస్‌జీ

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయడానికి ఎంతో ఆసక్తితో ఉన్నామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ (ఎన్‌ఐఎ్‌సజీ) స్పష్టం చేసింది. వెలగపూడి సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టీజీఎస్‌) కార్యాలయంలో ఎన్‌ఐఎ్‌సజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (సీఈవో) రాజీవ్‌ బన్సల్‌ తన అధికార బృందంతో పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. తాము ఇప్పటికే ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో చేపడుతోన్న వివిధ కార్యకలాపాల గురించి అధికారులకు వివరించారు. పలు రాష్ట్రాల్లో వారి అవసరాలను బట్టి ఈ-గవర్నెన్స్‌, స్ట్రాటజీ ప్లానింగ్‌, డిజైనింగ్‌ తదితర రంగాల్లో సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. అధునాతన టెక్నాలజీని అందించేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేయాలని భావిస్తున్నామని రాజీవ్‌ బన్సల్‌ అన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యమైన స్వర్ణాంధ్ర-2047కు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

Updated Date - Jan 18 , 2025 | 04:56 AM