Share News

CPI Narayana: ప్రత్యేక హోదా సాధనకు చొరవ చూపండి

ABN , Publish Date - May 01 , 2025 | 03:54 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీ వద్ద చొరవ చూపాలని సూచించారు. గత ఐదేళ్లుగా అమరావతి అభివృద్ధిని విస్మరించినట్లు ఆయన వ్యాఖ్యానించారు

CPI Narayana: ప్రత్యేక హోదా సాధనకు చొరవ చూపండి

  • సీఎం, డిప్యూటీ సీఎంకు నారాయణ సూచన

గూడూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): విభజన హామీ చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందు కు ప్రధాని మోదీ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవ చూపాలని సీపీఐ జాతీయ కార్యద ర్శి నారాయణ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పదేళ్ల కిందట అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడు ఢిల్లీ నుం చి మట్టి, నీరు తీసుకొచ్చారు. గత ఐదేళ్లు మోదీతో, మాజీ సీఎం జగన్‌ నడిచి అమరావతి అభివృద్ధిని విస్మరించారు.’ అని నారాయణ తెలిపారు.

Updated Date - May 01 , 2025 | 03:54 AM