Share News

Nara Lokesh: ఫేక్ ప్రచారానికి దిగిన వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్: లోకేష్

ABN , Publish Date - Oct 27 , 2025 | 09:55 PM

వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! అంటూ ఒక ఫొటోను జోడించారు.

Nara Lokesh: ఫేక్ ప్రచారానికి దిగిన వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్: లోకేష్
Nara Lokesh

అమరావతి, అక్టోబర్ 27: వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! అంటూ ఒక ఫొటోను జోడించారు. 'ఏపీలో రోడ్ల పరిస్థితి అంటూ.. వేరే రాష్ట్రానికి చెందిన పాత ఫొటోలతో అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.


పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్ పై ప్రజలను చైతన్యపరిచేందుకు గుజరాత్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి 2022లో ఈ పోస్టు చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఓ స్కూల్ బాలికపై బురద పడినట్లు ఉన్న ఫొటోను తీసుకువచ్చి ఏపీకి ఆపాదించారు. ఇలాంటి దుష్ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ పేటీఎం బ్యాచ్ పై కఠిన చర్యలు తప్పవు' అని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

Cyclone Montha: జెట్ స్పీడులో దూసుకొస్తున్న మొంథా తుపాను.. అధికారులు అలర్ట్

Boy Assasinated By Neighbor: అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..

Updated Date - Oct 27 , 2025 | 10:13 PM