Share News

Nara Lokesh Review: రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో మంత్రి నారా లోకేష్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:00 PM

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి అధికారులు లోకేష్‌కు వివరాలు తెలియజేశారు. ఇప్పటివరకు 215 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.

Nara Lokesh Review: రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో మంత్రి నారా లోకేష్‌
Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు చేరుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి అధికారులు లోకేష్‌కు వివరాలు తెలియజేశారు. ఇప్పటివరకు 215 మంది తెలుగువారు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ సమస్యపై నారా లోకేష్ సత్వరమే స్పందించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు (Nara Lokesh Nepal update).


కేంద్రంతో సంప్రదించి బాధితులను స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. నేపాల్‌లో చిక్కుకున్న బాధితులతో మంత్రి లోకేష్‌ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. నేపాల్‌ చిక్కుకున్న సూర్యప్రభతో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని లోకేష్‌కు సూర్య ప్రభ వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి నేపాల్ వెళ్లి చిక్కుకున్నామని సూర్యప్రభ తెలిపారు. హోటల్ గది నుంచి బయటకు రావొద్దని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపారు (AP rescue coordination).


కాఠ్మాండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్‌లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి రప్పించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు (Nara Lokesh emergency response). బాధితులకు తక్షణ సహాయం అందించాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు.


Also Read:

జార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

నేపాల్లో పరిస్థితి ఉద్రిక్తం..భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

For More Latest News

Updated Date - Sep 10 , 2025 | 01:00 PM