Nara Lokesh: ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Dec 17 , 2025 | 08:42 PM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు భారీ ఉపశమనం లభించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు హర్షాతిరేకాలు..
అమరావతి, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విద్యాసంస్థలకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించింది కూటమి ప్రభుత్వం. మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ NOC తీసుకోవాలనే నియమాన్ని తొలగించి, ఈ రోజు జీవో జారీ చేసింది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం 30 మీటర్ల వరకు ఎత్తు ఉన్న విద్యాసంస్థలు ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి మాత్రమే ఫైర్ NOC తీసుకోవాలి. పాఠశాలల రెన్యూవల్ (రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ) 10 ఏళ్లకు ఒకసారి చేయించుకోవడానికి అవకాశం కల్పించారు.
గత ప్రభుత్వం పెట్టిన ఏటా NOC తీసుకోవాలనే నిబంధన ప్రైవేట్ పాఠశాలలకు భారీ ఇబ్బంది కలిగించిందని, దీన్ని మార్చాలని టీడీపీ ఎమ్మెల్యేసీలు మంత్రి లోకేష్‌ను కోరారు. వారి అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నిర్ణయం ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకుల్లో ఆనందం నింపుతోంది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News