Nara Lokesh: వారిని అభినందించిన మంత్రి నారా లోకేష్..
ABN , Publish Date - May 20 , 2025 | 07:49 PM
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంత్రి నారా లోకేష్ కలిశారు. మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
అమరావతి: పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను మంత్రి నారా లోకేష్ కలిశారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు ఆ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని విద్యాసంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారని అన్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేయిస్తామని తెలిపారు. కష్టపడి పనిచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.
విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారంటే అది లోకేష్ కృషి అని ప్రశంసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తమ పాఠశాల సమస్యలను విద్యార్ధులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ప్రతి సమస్యను పరిష్కారిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు నారా లోకేష్.
Also Read:
CBSE Revaluation: 10, 12 తరగతుల రీవాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్ తేదీలు ఇవే..
Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్రాకు ఎలా వెళ్లాలి.. ఎన్ని రోజులు పడుతోందంటే..
Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..