Share News

CBSE Revaluation: 10, 12 తరగతుల రీవాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్ తేదీలు ఇవే..

ABN , Publish Date - May 20 , 2025 | 06:34 PM

CBSE 10, 12వ తరగతి ఫలితాలను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రీవాల్యుయేషన్‌, రీవెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. తమ మార్కులతో సంతృప్తిగా లేనివాళ్లు CBSE అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CBSE Revaluation: 10, 12 తరగతుల రీవాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్ తేదీలు ఇవే..
CBSE

CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. రీవాల్యుయేషన్‌, రీవెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను CBSE బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్ధులు, తక్కువ మార్కులు సాధించిన విద్యార్ధులు CBSE అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు వారు కోరుకున్న సబ్జెక్టును వెరిఫికేషన్‌ లేదా రీ వాల్యుయేషన్‌, లేదా రెండింటికీ కూడా అప్లై చేసుకోవచ్చు.


CBSE ప్రకటించిన నోటీసు ప్రకారం, 12వ తరగతి విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్ స్కాన్ కాపీలను పొందడానికి మే 21 నుండి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టు రూ. 700 ఉంటుంది. అలాగే, 10వ తరగతి విద్యార్ధలు తమకు నచ్చిన సబ్జెక్ట్ స్కాన్ కాపీలను పొందడానికి మే 25 నుండి జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాలి. 12వ తరగతి విద్యార్థులు మే 28 నుండి జూన్ 6 వరకు మార్కుల రీ-వాల్యుయేషన్, రీ-వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్టు రూ. 500, రీ-వాల్యుయేషన్‌కు ఒక్కో ప్రశ్నకు రూ. 100 ఖర్చవుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - cbse.gov.in.

కావాల్సిన సబ్జెక్ట్‌పై క్లిక్ చేయండి

సబ్జెక్టుకు రూ. 500–రూ. 700 చెల్లించండి.

హాల్ టికెట్ వివరాల ద్వారా సబ్జెక్టు కాపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి.


Also Read:

Hyderabad: మాయ లేడీలు.. పెళ్లి చేస్తానంటే నమ్మాడు.. పెళ్లి రోజు ఊహించని షాక్..

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళను.. 10 సెకన్లలో పసిగట్టారంటే.. మీది డేగ చూపే..

Minister Sridhar Babu: కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Updated Date - May 20 , 2025 | 07:32 PM