Share News

Nandamuri Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఆశిస్తున్నా

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:18 AM

నా తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌. ఆ మహోన్నత వ్యక్తికి ఎన్డీయే కూటమి హయాంలో భారతరత్న తప్పక వస్తుందని భావిస్తున్నా’ అని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన స్వగ్రామైన నిమ్మకూరుకు గురువారం ఆయన ఆకస్మికంగా వచ్చారు.

Nandamuri Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఆశిస్తున్నా

నిమ్మకూరులో సినీనటుడు బాలయ్య సందడి

పామర్రు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడ్డ మహోన్నతుడు, నా తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌. ఆ మహోన్నత వ్యక్తికి ఎన్డీయే కూటమి హయాంలో భారతరత్న తప్పక వస్తుందని భావిస్తున్నా’ అని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తన స్వగ్రామైన నిమ్మకూరుకు గురువారం ఆయన ఆకస్మికంగా వచ్చారు. గ్రామంలోని ఎన్టీఆర్‌ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన సమీప బంధువు ఇంట్లో కాసేపు గడిపారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ బిడ్డగా తనను ఆదరిస్తున్నవారికి రుణపడి ఉంటానన్నారు. తన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్‌ అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి అభివృద్ధికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. అభిమానుల కోరిక మేరకు వచ్చే నెలలో ఆదిత్య369 సినిమాను మరోసారి రీలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మకూరులో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, డొంకరోడ్ల అభివృద్ధి, తన తండ్రి స్థలంలో ఇంటి పునర్నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పడమటి శ్రీనివాసరావు, నందమూరి శివరామకృష్ణ, జయకృష్ణప్రసాద్‌, సూరపనేని చంద్రశేఖర్‌, కుదరవల్లి లక్ష్మణస్వామి, రఘరామయ్య, కోమరవోలు మాజీ సర్పంచ్‌ కాకరాల హరిబాబు, బాలకృష్ణ ప్రోగాం ఇన్‌చార్జి పోరంకి గాంధీ తదితరులు పాల్గొన్నారు.



ఈ జన్మలో కొమరవోలు రాను: బాలకృష్ణ

మచిలీపట్నం: బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారని తెలుసుకున్న ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం స్వగ్రామం కొమరవోలు మాజీ సర్పంచ్‌ కాకరాల హరిబాబు, వేణు మరికొందరు ఆయనను కలిశారు. బాలకృష్ణను కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరవోలు వచ్చి చాలా రోజులైందని, ఒకసారి తమ గ్రామానికి రావాలని కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ ‘కొమరవోలా, అదెక్కడ, ఈ జన్మలో రాను. నాతో ఫొటోలు దిగారుగా వెళ్లిపోండి’ అన్నారు. దీంతో కొమరవోలు గ్రామస్తులు అవాక్కయ్యారు. బాలకృష్ణ వస్తే తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశించి, వచ్చామని, ఎవరో చేసిన తప్పు తమ గ్రామంపై పడిందని, దీంతో బాలకృష్ణ ఆగ్రహంగా ఉన్నారని గ్రామస్తులు ఆవేదన చెందారు.



మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 05:18 AM