Minister Satya Kumar Yadav : ఎయిమ్స్‌ను.. 965 పడకలకు విస్తరించండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:25 AM
ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

ఎయిమ్స్ డైరెక్టర్‌తో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ భేటీ
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతెమ్ శాంతాసింగ్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన వైద్యసంస్థకు గత ప్రభుత్వం మంచి నీటి సౌకర్యాన్ని కూ డా కల్పించలేదన్నారు. 183 ఎకరాల్లో ఏర్పాటైన ఎయిమ్స్‌లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు స్థలం లేనందున, కొలనుకొండలో 10 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబ ఆదేశాలిచ్చినట్లు గుర్తు చేశారు. 965 పడకల ఆస్పత్రిగా మంజూరైన ఎయిమ్స్‌లో ప్రస్తుతం 650 పడకలున్నాయని, విస్తరణకు తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ శాంతాసింగ్‌కు మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం