Minister Nara Lokesh: కూలిన బ్రహ్మంగారి నివాస గృహం.. స్పందించిన మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Oct 29 , 2025 | 07:16 PM
బ్రహ్మంగారిమఠంలో 16 శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోవడంపై మంత్రి నారా లోకేష్ 'X' వేదికగా స్పందించారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని పునరుద్ధరించాలని, మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కడప, అక్టోబర్ 29: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు బ్రహ్మంగారిమఠంలో 16 శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ 'X' వేదికగా స్పందించారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని పునరుద్ధరించాలని, మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మంగారి నివాసం (The collapsed Brahmangari residence) కూలిపోయింది. దీంతో అధికారులపై, బ్రహ్మంగారి కుటుంబ సభ్యులపైన భక్తులు మండిపడుతున్నారు. అతి పురాతనమైన, చారిత్రాత్మక ఆనవాలు గల నివాసంపై శ్రద్ధ చూపలేదని మండిపడుతున్నారు. శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు ఇల్లును కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సచివాలయంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు వచ్చే 48 గంటల పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ ను పునరుద్ధరించాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంటనష్టం అంచనాలను రూపొందించాలన్నారు.
ఇది కూడా చదవండి:
Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం