Share News

Minister Lokesh: మీ ఏడుపులే మాకు దీవెనలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:09 AM

ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ను జాప్యంచేస్తున్నారన్న మాజీ సీఎం జగన్‌కు విద్యామంత్రి లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుపై ఎక్స్‌ వేదికగానే స్పందించారు.

Minister Lokesh: మీ ఏడుపులే మాకు దీవెనలు

  • ఈసెట్‌ కౌన్సెలింగ్‌పై.. జగన్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్‌

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ను జాప్యంచేస్తున్నారన్న మాజీ సీఎం జగన్‌కు విద్యామంత్రి లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుపై ఎక్స్‌ వేదికగానే స్పందించారు. ‘మీ ఏడుపులే మాకు దీవెనలు. మీరు ఐదేళ్లలో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యావ్యవస్థను గాడిన పెట్టడం చూసి.. మీకు కడుపు మంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడు కౌన్సెలింగ్‌ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. 2022లో సెప్టెంబరులో, 2023లో జూలై చివరికి కౌన్సెలింగ్‌ పూర్తిచేసిన మీరు.. మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే గత ఏడాది జూలై మూడో వారంలో కౌన్సెలింగ్‌ పూర్తిచేశామని, ఈ సంవత్సరం కూడా జూలై మూడో వారానికే మొదటి విడత కౌన్సెలింగ్‌ను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. 2020 నుంచి కౌన్సెలింగ్‌ జరిగిన తేదీల టేబుల్‌ను కూడా లోకేశ్‌ పోస్టు చేశారు.

Updated Date - Jun 30 , 2025 | 04:10 AM