Minister Kollu Ravindra : నవోదయం-2.0 ప్రారంభం

ABN , First Publish Date - 2025-02-20T04:48:49+05:30 IST

ఒంగోలులో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.

Minister Kollu Ravindra : నవోదయం-2.0 ప్రారంభం

  • రాష్ట్రాన్ని సారా రహితంగా మారుద్దాం: కొల్లు రవీంద్ర

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 19(ఆంధజ్యోతి): రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా మార్చుదామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఒంగోలులో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి నవోదయం 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ పేదలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోరాదనే ఉద్దేశంతో ప్రభుత్వం నవోదయం-2.0 కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ యువత నిర్వీర్యం కాకూడదని ప్రభుత్యం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. నాటుసారా, మత్తుపదార్దాల వల్ల కలిగే అనర్థాలను తెలుపుతూ ప్రత్యేక గీతాన్ని రాసిన కడప జిల్లా ఏఈఎస్‌ వినోద్‌ను మంత్రి రవీంద్ర సత్కరించారు. ప్రత్యేక గీతాన్ని, నవోదయం పోస్టర్లను ఆవిష్కరించారు. నగరంలో భారీ ర్యాలీని నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు.

Updated Date - 2025-02-20T04:48:52+05:30 IST