Share News

Housing Scheme: పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:44 AM

గత వైసీపీ ప్రభుత్వం 33 లక్షల మందికి స్థలాలు ఇస్తున్నామని ప్రకటించి, జగనన్న కాలనీల పేరిట రూ.18వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Housing Scheme: పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు

జగనన్న కాలనీల పేరిట 18వేల కోట్ల దుర్వినియోగం: మంత్రి కొలుసు

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 2029 నాటికి మెరుగైన, సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గృహనిర్మాణం పద్దుపై చర్చ సందర్భంగా ఆయన సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 33 లక్షల మందికి స్థలాలు ఇస్తున్నామని ప్రకటించి, జగనన్న కాలనీల పేరిట రూ.18వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి టిడ్కో, హౌసింగ్‌ శాఖ కలిపి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. జగనన్న కాలనీల్లో అవకతవకలపై విజిలెన్స్‌ విచారణ నివేదిక సిద్ధమైందని,బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు.



పేటలో అవినీతి మంత్రి: ప్రత్తిపాటి

వైసీపీ హయాంలో చిలకలూరిపేట నుంచి మంత్రిగా పనిచేసిన వ్యక్తి అవినీతి మంత్రిగా గుర్తింపు పొందారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అప్పట్లో ప్రతి పనిలో వసూళ్లు చేశారని, అవినీతి మంత్రిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆయన అక్రమాల్లోనే ‘తోపు’: పరిటాలసునీత

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. రాక్రీట్‌ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించి ఇస్తానని రూ.100 కోట్లు దోపిడీ చేశారని తెలిపారు. ఆయన పేదలకు ఇళ్లు కట్టడం అటుంచి అక్రమాలు చేయడంలోనే తోపుగా గుర్తింపు పొందారని విమర్శించారు.

వారికి తిరిగి అవకాశం ఇవ్వాలి: కూన రవికుమార్‌

ఇందిరమ్మ ఇళ్లు కట్టకుండానే కట్టినట్లుగా బిల్లులు డ్రా చేశారని, రాష్ట్రవ్యాప్తంగా 12లక్షల మంది ఈ తరహాలో మోసపోయారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. వారందరి పేర్లు ఇళ్లు నిర్మించుకున్నవారి జాబితాలో ఉండటంతో ఇప్పుడు కొత్త ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే అనర్హుల జాబితాలో చూపుతోందని, వారికి ఇళ్లు కట్టుకునేందుకు తిరిగి అవకాశం కల్పించాలని కోరారు. అప్పట్లో ఇళ్లు నిర్మించుకున్నట్లుగా ఉన్న వారి జాబితా నుంచి ఆ 12లక్షల మంది పేర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.



ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 05:44 AM