Share News

Minister Acchenna: జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలా

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:02 AM

జగన్‌... అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు. అసలు సిగ్గుందా నీకు?’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Minister Acchenna: జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలా

బాపట్ల, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌... అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు. అసలు సిగ్గుందా నీకు?’ అని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘పోలీసులు గడచిన ఐదేళ్లలో బాగా పని చేశారు. ఈ ఏడాదిలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ మంటగలిసింది’ అని అనడంపై మంత్రి అచ్చెన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ఏఎంసీ చైర్మన్‌ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్ల పాటు కనీసం తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛనివ్వకుండా అణచివేసిన వ్యక్తి ఈ రోజు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక కష్టనష్టాల కోర్చి ప్రజల పక్షాన పోరాడామని మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:02 AM