National Institute : పట్టణ తలసరి ఆదాయం పెంచేందుకు కృషి
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:35 AM
జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా పేదల తలసరి ఆదాయం పెంచేందుకు మెప్మా ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాదుల కార్యాచరణ ప్రణాళిక..
జీవనోపాదుల కార్యాచరణ ప్రణాళిక: మెప్మా మిషన్ డైరెక్టర్
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా పేదల తలసరి ఆదాయం పెంచేందుకు మెప్మా ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాదుల కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోందని మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్‌భరత్ ఒక ప్రకటననలో తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంఎ్‌సఎంఈ భాగస్వామ్యంతో పట్టణ పేదలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ల అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు, ఎంఎ్‌సఎంఈ జాతీయ ఇన్‌స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో సమావేశాలను ఏర్పాటు చేశామన్నారు.