DSC Notification : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 12 , 2025 | 03:55 AM
16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది.

జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగ ళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్‌లు ఉండేవని, వాటిని ఒక్క యాప్‌లోకి మార్చామని వివరించారు. త్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలుచేస్తామని శశిధర్ పేర్కొన్నారు.