Share News

Massive Tunnel Under Construction: రాజమార్గంలో అతి పే..ద్ద సొరంగం

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:01 AM

విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే 544జీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నెల్లూరు, కడప సరిహద్దు ప్రాంతమైన సీతారామపురం (నెల్లూరు జిల్లా) సమీపంలో అతిపెద్ద..

Massive Tunnel Under Construction: రాజమార్గంలో అతి పే..ద్ద సొరంగం

  • బెజవాడ-బెంగళూరు 544-జీ హైవేలోరెండు వరుసలుగా నిర్మాణం

  • నెల్లూరు-కడప సరిహద్దులో శరవేగంగా పనులు

  • 3.7 కిలోమీటర్ల మేర నిర్మాణం

  • 100 కి.మీ తగ్గనున్న దూరం

ఉదయగిరి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే 544-జీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నెల్లూరు, కడప సరిహద్దు ప్రాంతమైన సీతారామపురం (నెల్లూరు జిల్లా) సమీపంలో అతిపెద్ద సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 518 కిమీ మేర ఈ ఆరు వరుసల జాతీయ రహదారిని నిర్మిస్తుండగా.. అందులో భాగంగా సీతారామపురం వద్ద ఉన్న కొండను తొలచి రూ.857.75 కోట్లతో రెండు వరుసలుగా ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణాల్లో నిర్మించిన టన్నెళ్లలో ఇదే అతిపెద్దదని అధికారులు చెబుతున్నారు. దీని పొడవు 3.7 కిలోమీటర్లు. రెండు వరుసల్లో ఒక్కోదాని వెడల్పు 16.7 మీటర్లు.. ఎత్తు 9.8 మీటర్లు. ఈ పనులను మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.857.75 కోట్లతో దక్కించుకుంది. 2027 ఫిబ్రవరిలోపు పూర్తి చేయనున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంతో విజయవాడ-బెంగళూరు వాహనదారులకు 100 కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు 3 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అనంతపురం జిల్లా కొడికొండ వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి.. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 04:01 AM