Murali Nayak: జాతీయ జెండా కప్పుకొనే చనిపోతా.

ABN , First Publish Date - 2025-05-13T05:03:46+05:30 IST

జాతీయ జెండా కప్పుకొనే చనిపోతా అని పలికిన అమర జవాన్ మురళి నాయక్ యొక్క చివరి ఇష్టం పూర్తయింది. అతని అంత్యక్రియల సందర్భంగా జాతీయ జెండా కప్పబడిన శరీరాన్ని సైనికాధికారి మురళి నాయక్ తల్లిదండ్రులకు అందించారు.

Murali Nayak: జాతీయ జెండా కప్పుకొనే చనిపోతా.

అమర జవాన్‌ మురళీనాయక్‌ వ్యాఖ్యలు గుర్తొచ్చి కన్నీటిపర్యంతమైన మిత్రులు, తల్లిదండ్రులు

హిందూపురం, మే12(ఆంధ్రజ్యోతి): ‘నేను జాతీయ జెండా కప్పుకొనే చనిపోతా..’ అని అమర జవాన్‌ మురళీనాయక్‌.. స్నేహితులతో అనేవారట. మురళీనాయక్‌ మాటలు తలుచుకుని స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. చెప్పినట్లుగానే జాతీయ జెండా కప్పుకొనే చనిపోయారంటూ ఆవేదన చెందారు. ఆయన అంత్యక్రియలు ఈనెల 11న శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాలో ముగిశాయి. అనంతరం జవాన్‌ పార్థివదేహంపై కప్పిన జాతీయ జెండాను ఆయన తల్లిదండ్రులకు సైనికాధికారి అందించారు. ఆ త్రివర్ణ పతాకాన్ని అందుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికొస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ సైనికాధికారికి తండ్రి శ్రీరామ నాయక్‌ సెల్యూట్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - 2025-05-17T00:47:54+05:30 IST