Sukma District : హిడ్మా ఇలాకాలో సీఆర్‌పీఎఫ్ గురుకులం
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:14 AM
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై కోటి రూపాయల రివార్డు కలిగి ఉన్న మడవి హిడ్మా కంచుకోటలో పాఠశాల ప్రారంభించారు.

చింతూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ప్రభావంతో విద్యకు దూరమైన అడవి బిడ్డలు ఇక బడి బాట పట్టనున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై కోటి రూపాయల రివార్డు కలిగి ఉన్న మడవి హిడ్మా కంచుకోటలో పాఠశాల ప్రారంభించారు. హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లా పువర్తికి అతి సమీప గ్రామమైన టేకులగూడలో సీఆర్‌పీఎఫ్ నేతృత్వంలో శనివారం గురుకులం ప్రారంభించారు. త్వరలోనే పువర్తిలో కూడా గురుకులం ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠాలు బోధించనున్నారు. 2019లో టేకులగూడలో 29 మంది సీఆర్‌ఫీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి ఆపై కాల్పులు జరిపి చంపారు. అప్పటి నుంచి పువర్తి, టేకులగూడ ప్రాంతాలకు జవాన్లు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం నియాద్ నెలనార్ (మా మంచి గ్రామం) అంటూ ప్రవేశపెట్టిన పఽథకంలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. ఈ క్రమం లో పువర్తిలో గత ఏడాది ఫిబ్రవరి 18న సీఆర్‌ఫీఎఫ్ బలగాలు క్యాంపు ఏర్పాటు చేసి జాతీయజెండా ఎగురవేసి రికార్డు సృష్టించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..