Srisailam: మయూర వాహనంపై మల్లన్న విహారం
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:46 AM
గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కాగా.. శనివారం ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి కె.పెంచల కిషోర్..

శ్రీశైలం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కాగా.. శనివారం ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి కె.పెంచల కిషోర్.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జె.శ్యామలరావు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రావణవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.