Srisailam: కన్నుల పండువగా మల్లన్న రథోత్సవం
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:21 AM
గురువారం సాయంత్రం శ్రీగిరి క్షేత్రవీధులలో అశేష భక్త జనం నడుమ స్వామిఅమ్మవార్ల రథోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో వెండిపల్లకిపై తోడ్కొని వచ్చారు.
వైభవంగా తెప్పోత్సవం.. హాజరైన అశేష భక్త జనం
శ్రీఽశైలం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్న రథంపై విహరిస్తూ భక్తజనులను కరుణించారు. గురువారం సాయంత్రం శ్రీగిరి క్షేత్రవీధులలో అశేష భక్త జనం నడుమ స్వామిఅమ్మవార్ల రథోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో వెండిపల్లకిపై తోడ్కొని వచ్చారు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఈవో శ్రీనివాసరావు, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఆలయ అర్చకులు రథానికి రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి క్రతువును శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలు, పరిమళ ద్రవ్యాలతో అలకరించిన రథంపై అధిష్ఠింపజేసి సాత్విక బలిగా కొబ్బరికాయలను, గుమ్మడికాయలను సమర్పించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం దాకా, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం రథోత్సవం సాగింది. రాత్రి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ క్రతువుకు శుక్రవారం పూర్ణాహుతి, ధ్వజావరోహణ చేయనున్నారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News