Maha Shivaratri: భృంగి వాహనంపై శ్రీశైల మల్లన్న
ABN , Publish Date - Feb 21 , 2025 | 06:16 AM
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు గురువారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు గురువారం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను భృంగివాహనంపై ఆశీనులనుజేసి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు.
ద్వారకా తిరుమల నుంచి పట్టువస్త్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం తరపున అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు. శుక్రవారం(నేడు) విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిఅమ్మవార్ల దేవస్థానం తరపున భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News