life imprisonment: హత్య కేసులో ఏడుగురికి జీవితఖైదు
ABN , Publish Date - May 17 , 2025 | 03:58 AM
బాపట్ల జిల్లాలో లడ్డూ సూరిబాబును రుణ సమస్యలు, వివాహేతర సంబంధాల కారణంగా సింహాద్రి కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నేరం నిరూపణతో ఏడుగురికి జీవిత ఖైదు శిక్ష విధించారు.
సీసీఎల్ కోర్టుకు మరో ఇద్దరు మైనర్ల తరలింపు
చీరాల, మే16 (ఆంధ్రజ్యోతి): ఇంటికి భోజనానికి పిలిచి, ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు...బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకి చెందిన మోసా సూరిబాబు(30), అదే గ్రామానికి చెందిన పిక్కి సింహాద్రికి రూ.3లక్షలు అప్పు ఇవ్వగా, తిరిగి ఇవ్వకపోవడంతో మనస్పర్ధలు చెలరేగాయి. అదేసమయంలో సింహాద్రి భార్యతో సూరిబాబుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈక్రమంలో సింహాద్రి, తన భార్య శాంతి, కుమార్తె, కుమారుడు(మైనర్‌లు) సహాయంతో సూరిబాబును అంతమొందించాలని పన్నాగం పన్నాడు. బంధువులైన వైజాగ్‌కు చెందిన బొంది డేవిడ్, గ్రామానికి చెందిన పిక్కి రాజు, పిక్కి ఆనంద్, పిక్కి సత్తెమ్మ, ఓరుపుల మాణిక్యంను ఆశ్రయించాడు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామని సూరిబాబుతో రెండు, మూడు రోజులు మాట్లాడారు. 2023 అక్టోబర్ 10 రాత్రి ఇంటికి భోజనానికి పిలిచారు. సూరిబాబు కూడా అంగీకరించి వెళ్లాడు. అప్పటికే ఇంట్లో నక్కిన ఐదుగురు, సింహాద్రి కుటుంబ సభ్యులు ఇనుప రాడ్లు, పైపులతో సూరిబాబుపై దాడిచేశారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈపూరుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం నిరూపణ కావడంతో ఒంగోలు అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు న్యాయాధికారి ఏ.పూర్ణిమ ఏడుగురికి జీవితఖైదుతోపాటు, రూ.2వేలు జరిమానా విధించారు. అయితే కేసులో అప్పట్లో మైనర్లుగా ఉన్న సింహాద్రి కుమార్తె, కుమారుడుకు సీసీఎల్ కోర్టులో చార్జీషీటు వేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News