Share News

క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:59 PM

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని రోటరీ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ త్రివిక్రమ్‌ జోషి అన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి
క్రీడాకారులతో రోటరీ క్లబ్‌ సభ్యులు

ఆదోని అగ్రికల్చర్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని రోటరీ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ త్రివిక్రమ్‌ జోషి అన్నారు. ఆదివారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా మైదానంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో న్యూ జనరేషన్‌ యాక్టివిటీస్‌ 2025-26 యాన్యువల్‌ జోనల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధి రోటరీ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ త్రివిక్రమ్‌ జోషి, డిప్యూటీ ఈవో రాజేంద్రప్రసాద్‌, లెక్చరర్‌ కళ్యాణ్‌ కుమార్‌, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు డా. సైఫుల్లా, సెక్రెటరీ మేఘనాథ్‌ రెడ్డి, యూత్‌ ఆఫీసర్‌ సాబీర్‌, వికాస్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో 60 పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు కప్పులతో పాటు, సర్టిఫికెట్లను అందజేశారు. సహకరించిన 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులను, పీఈటీలను సన్మానించారు. రోటరీ క్లబ్‌ ట్రెజరర్‌ షణ్ముఖ, సభ్యులు శ్రీధర్‌ రెడ్డి, జీవన్‌సింగ్‌, విట్టా మురళీధర్‌, సోమశేఖర్‌ రెడ్డి, భరత్‌ షా, ప్రశాంత్‌ గాంధీ, సుబ్బయ్య, వీరేష్‌ స్వామి, పద్మనాభయ్యశెట్టి, సందీప్‌రెడ్డి, శేషయ్య, శివరాం, హుస్సేన్‌ బాషా, వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 11:59 PM