వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:28 AM
నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామంలో పలు దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.

నందికొట్కూరు రూరల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామంలో పలు దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. గణపతి సహిత లక్ష్మీసత్యనారాయణ స్వామి, సీతారామలక్ష్మణహనుమత్ సమేత హనమత్ ధ్వజ, వృషభ ధ్వజ, ఆలయ శిఖర సహిత వీరాంజనేయ స్వామి, రాధాకృష్ణ, వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. టీడీపీ నంద్యాల ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అంతా స్నేహ సౌభ్రాతృత్వంతో మెలగాలని, గ్రామాల అభివృద్ధికి అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ రవియాదవ్, టీడీపీ మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్‌రెడ్డి, కౌన్సిలర్ జాకీర్ హుశేన్, మద్దిలేటి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.