ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు: డీఈవో
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:31 AM
విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నేర్చాలని, ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని డీఈవో జనార్దన్‌రెడ్డి సూచించారు.

పగిడ్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నేర్చాలని, ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని డీఈవో జనార్దన్‌రెడ్డి సూచించారు. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలను డీఈవో గురువారం తనిఖీ చేశారు. జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారు? అని అడిగి తెలుసుకున్నారు. డీఈవో మాట్లాడుతూ పరీక్షలంటే ఎవరూ భయపడవద్దని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు. అనంతర రికార్డులను తనిఖీ చేసి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవో మురళీమోహన్‌రెడ్డి, హెచ్‌ఎం మధుసూదన్‌రావు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆదర్శ పాఠశాలలో వంట నిర్వాహకుల మధ్య సమస్యల కారణంగా విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి నెలకొందని, నిర్వాహకులు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని డీఈవో జనార్ధన్‌రెడ్డి హెచ్చరించారు. తరగతిగదిలోకి వెళ్లి ఎంత మంది విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.
నందికొట్కూరు రూరల్: విద్యార్థులు ఇష్టంతో చదివితే విజయం సాధించవచ్చని డీఈవో జనార్దన్ రెడ్డి అన్నారు. మండలంలోని కొణిదేల జిల్లా పరరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో పరీక్షలపై సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రత్యేక పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. రికార్డులను రసాయనిక ప్రయోగశాలను, క్రీడా మైదానాన్ని పరశీలించారు. క్రీడా మైదానంలో కొబ్బరిచెట్టును నాటారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాన్, హెచ్‌ఎం శ్రీరామ చంద్రమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.