క్రీడల వైపు ప్రోత్సహించాలి : డీఈవో
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:56 AM
పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని డీఈవో శామ్యూల్‌పాల్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు.
పెద్దకడబూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని డీఈవో శామ్యూల్‌పాల్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, నాయకులు అబ్దుల్లా, రంగప్ప, దాసు, విల్సన్, తిక్కన్న, రామన్న, సతీష్, కల్యాణ్, రాజు పాల్గొన్నారు.