ఫెన్సింగ్ పోలీస్ జట్టుకు ఎస్పీ అభినందన
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:23 PM
మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి పోలీస్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన పోలీస్ జట్టును ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుక్రవారం అభినందించారు.

నంద్యాల క్రైం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి పోలీస్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన పోలీస్ జట్టును ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుక్రవారం అభినందించారు. ఈ నెల 8న గుంటూరులో జరిగిన ఎంపిక పోటీల్లో రాష్ట్ర స్థాయికి 12మంది ఎంపికైనట్లు క్రీడాకారులు తెలిపారు. వీరికి నంద్యాల ఇండోర్ స్టేడియంలో శిక్షకుడు లక్ష్మణ్ ఆధ ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మంచి శిక్షణతో రాష్ట్రానికి విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైన 12మందిలో నంద్యాల పోలీస్ స్టేషన్‌లో పనిచేసే నలుగురు సిబ్బంది ఎంపికకావడం విశేషం. ఈ సందర్భంగా క్రీడాకారులందరినీ నంద్యాల మూడో పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కంబగిరి రాముడు అభినందించారు.