శివరాత్రి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: ఈవో
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:35 AM
శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేది వరకు జరిగే శివరాత్రి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకుని ఆయా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

శ్రీశైలం(ఆత్మకూరు), జనవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేది వరకు జరిగే శివరాత్రి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకుని ఆయా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన దేవస్థానం పరిధిలోని పాతాళాగంగ, డార్మిటరీలు, కళ్యాణకట్ట, శివదీక్షా శిబిరాలు, శౌచలయాలు, మల్లికార్జున సదన్ వసతి గృహం తదితర ప్రదేశాలను పరిశీలించి ఆయా విభాగాల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, ఏఈవో మల్లికార్జునరెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు డాక్టర్ సి.అనిల్‌కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, పారిశుధ్య, భద్రతా విభాగాల పర్యవేక్షకులు రాధాకృష్ణ, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.