జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:07 AM
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బోయ నరసింహులు ఇటీవల వేలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు.
ఎమ్మిగనూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బోయ నరసింహులు ఇటీవల వేలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన విద్యార్థి నరసింహులును ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 800, 1500, 4/400 రిలే పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలు సాధించాడని చెప్పారు. నవంబరులో హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. అధ్యాపకులు లుక్మన్, రంగస్వామి, యల్లప్ప, రాజశేఖర్, లక్ష్మన్న, రంగనాయక్, విద్యార్థి తల్లిదండ్రులు రాగయ్య, జయమ్మ పాల్గొన్నారు.