మోటార్ సైకిళ్ల సీజ్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:03 AM
నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
నంద్యాల క్రైం ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేని 17 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతూ నేరాలకు పాల్పడే అవకాశం లేకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ అధిరాజ్ రాణా ఆదేశాల మేరకు డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.